కరోనా లాక్ డౌన్ తర్వాత దేశంలో యూపీఐ లావాదేవీలు చేసేవారి సంఖ్య భారీగా పెరిగింది. కాగా, మార్చి నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.14 లక్షల కోట్ల విలువైన 870 కోట్ల లావాదేవీలు జరిగాయని NPCI తెలిపింది. గతేడాది మార్చితో పోలిస్తే యూపీఐ ట్రాన్సాక్షన్లు విలువ పరంగా 60 శాతం, విలువపరంగా 46 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా 800 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి.