ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూరత్ సెషన్స్ కోర్టులో అప్పిల్ కు రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Sun, Apr 02, 2023, 08:54 PM

కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తన కేసు విషయంలో ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఇదిలావుంటే పరువు నష్టం కేసులో తనపై  విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్ర నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ.. సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై ఆయన పైకోర్టు అయిన సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారని సమాచారం. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు.. పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెలపాటూ గడువు ఇచ్చింది.

ఈ క్రమంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలనీ లేదంటే తాత్కాలికంగా స్టే విధించాలని రాహుల్ కోరుతున్నట్లు తెలుస్తోంది. కింది కోర్టు తీర్పును కొట్టివేస్తే రాహుల్ గాంధీకి తిరిగి లోక్ సభ సభ్యత్వం దక్కుతుంది. కానీ, ఆయనను దోషిగా తేల్చిన తీర్పును సమర్థిస్తే రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వాయనాడ్ నియోజకవర్గానికి తిరిగి ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. అప్పుడు రాహుల్ 8 ఏళ్లపాటూ ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com