నేడు ఉదయం.11 గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డితో సీఆర్డీఏ అథారిటీ భేటీ ఐనది. ఈ నేపథ్యంలో రాజధానిలో సెంటు భూమి పట్టాలకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోకుండా ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. గుంటూరు కలెక్టర్‌కు 550, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు 583 ఎకరాలు కేటాయింపు జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ఎకరానికి రూ. కోటి రూపాయల ధరగా ప్రభుత్వ నిర్ణయించింది. ధరను మళ్లీ సమీక్షించుకోవచ్చంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. కాగా, నేడు సీఆర్డీఏ సమావేశంలో ఆమోదంతో..రాజధాని ప్రాంతంలో బయటివారికి పట్టాలు కేటాయించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే హైకోర్టులో ఆర్-5 కేసు పెండింగ్‌లో ఉండగా..పట్టాలు ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై నేడు హైకోర్టులో రాజధాని రైతులు లంచ్‌మోషన్ పిటిషన్ వేయనున్నారు.