ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోనిముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం వైయస్ జగన్, పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. క్యాంపెయిన్‌పై పార్టీ శ్రేణులకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు.