మహిళా సాధికారతే ప్రధాన ధ్యేయం అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం,రణస్థలం మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్స్ లో వైయస్ఆర్ ఆసరా పథక లబ్ధిదారులతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం పథకాల అమలును సాధ్యం చేస్తున్నాం. ముఖ్యంగా ఇంటి గౌరవాన్ని పెంచే, ఇంటికి ఆర్థిక క్రమశిక్షణ ఇచ్చే ఇల్లాలికి అండగా ఉండేందుకు పలు పథకాలు అమలు చేస్తూ ఉన్నాం. ఆ రోజు పాదయాత్రలో భాగంగా డ్వాక్రా సంఘాల రుణాలు చెల్లించేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి విపక్ష నేత హోదాలో మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మూడు విడతలు చెల్లించాం. ఇంకా ఒక్క విడత మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఇవాళ ఇన్ని పథకాలు సమర్థ రీతిలో,మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అమలు అవుతున్నాయంటే అందుకు కారణం మీరు. 2019 లో ఓటు వేసి అధికారం ఇవ్వడం వల్లనే సీఎం జగన్ చేయగల్గుతున్నారు అని ఆనందాన్ని వ్యక్త పరిచారు.