చుక్కల భూమి సమస్యకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. దశాబ్దాలుగా చుక్కల భూమి సమస్యలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రైతులు మరింత సమస్య ఎదుర్కొంటున్నారు. చుక్కల భూమి సమస్య పరిష్కారం కోసం గతంలో చాలా కఠినమైన నిబంధనలు ఉండేవి. ఆ సమస్యలు పరిష్కారం అయ్యేలా.. సీఎం వైయస్ జగన్, సరళీకృత నిబంధనలు తీసుకొచ్చారు. వీఆర్‌ఓ, ఎమ్మార్వో, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్.. చివరకు సీసీఎల్‌ఏ ఆమోదం తర్వాత చుక్కల భూమి నుంచి తొలగించాలనే నిబంధనను సీఎంగారు సరళీకరించారు. దీంతో నెల్లూరు జిల్లా రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇందుకు జిల్లా రైతుల పక్షాన సీఎం వైయస్ జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడి రైతుల గోడు పట్టించుకుని, సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినందుకు ఆయనకు పాలాభిషేకం చేశామని మంత్రి తెలిపారు.