నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన్ గ్రీవెన్స్ కార్యక్రమంలో నరసన్నపేట పట్టణంలో జరుగుతున్న చెరువులు ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ కు నరసన్నపేట మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే నరసన్నపేటలో గల చెరువులు చాలా వరకు ఆక్రమించుకోవడం జరిగిందని, ఇంకా ఆక్రమణలు ఆగడం లేదని మాజీ ఎమ్మెల్యే బగ్గు ఆవేదన వ్యక్తంచేశారు.