శ్రీకాకుళం రోడ్డు ఆముదాలవలస రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు ఊసావానిపేట సమీపంలో ఉన్న రైల్వే గేటు పడితే వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్లు ఫ్లై ఓవర్ నిర్మాణంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. సోమవారం రైల్వే గేట్ పడి పలు రైళ్లు రాకపోకల సమయంలో సుమారు 30 నిమిషాల పాటు తీయక పోవడంతో వాహనదారులు , ప్రయాణికులు నానా ఇబ్బందులు అవస్థలు పడ్డారు. ఇప్పటికైనా రైలు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.