ప్రధాని మోదీ సీబీఐపై ప్రశంసలు కురిపించారు. గతంలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఢిల్లీలో సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలక పాత్ర అని తెలిపారు. 2014 తర్వాత సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తుందని, ఇప్పుడు అవినీతిపరులు భయపడుతున్నారని అన్నారు. గతంలో రూపాయికి 85 పైసలు దోపిడీ అయ్యేవని, ఆ విధానాన్ని ధ్వంసం చేశామన్నారు.