రాజస్థాన్ సీఎం, మాజీ సీఎం కరోనా బారిన పడ్డారు. ఈరోజు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అలాగే, మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే కూడా ఈరోజు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా, సోమవారం సూరత్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సీఎం అశోక్ గెహ్లాట్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.