నిరుద్యోగులకు ఇదో శుభవార్త. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకోసం కేంద్ర ప్రభుత్వం మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిద మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నియామక ప్రకటన జారీ చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ) విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 3 లోగా దరఖాస్తు చేసుకోవాలని కేంద్రంసూచించింది.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు..
ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగంలో.. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
ఇంటలిజెన్స్ బ్యూరోలో.. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు
సీబీడీటీలో.. ఇన్ కం ట్యాక్స్ ఇన్ స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్
సీబీఐలో.. సబ్ ఇన్ స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్
ఎన్ హెచ్ఆర్ సీలో.. రీసెర్చ్ అసిస్టెంట్
ఎన్ఐఏలో.. సబ్ ఇన్ స్పెక్టర్
నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోలో.. సబ్ ఇన్ స్పెక్టర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
కాగ్ లో.. ఆడిటర్, అకౌంటెంట్
తపాలా శాఖలో.. పోస్టల్ అసిస్టెంట్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
ఆర్థిక మంత్రిత్వ శాఖలో.. సబ్ ఇన్ స్పెక్టర్