హిందూపురం పట్టణం బోయపేటకు చెందిన వికాస్ (24) మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. కియా పరిశ్రమలో పనిచేస్తున్న అతను నెల నుంచి పనిమానేసి ఓ కంపెనీలో రూ. 50 వేలు పెట్టుబడి పెట్టి ఇంట్లోనే పనిచేసుకుంటున్నాడని, పెట్టిన పెట్టుబడికి లాభాలు రాకపోవటం, ఉన్న ఉద్యోగం వదిలివేయటంతో మానసికంగా కుంగిపోయి మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ పేర్కొన్నారు.