రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు ఉన్నాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, అశోక్ కుమార్లు మంగళవారం తెలిపారు. వచ్చే ఐదు రోజులూ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 39. 6 నుంచి 41. 0 సెల్సియస్ డిగ్రీలుగా, రాత్రి ఉష్ణోగ్రతలు 24. 0 నుంచి 25. 5 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. నైరుతి దిశగా గాలులు తీవ్రత గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. ఉదయం పూట గాలిలో తేమ 48 శాతం, మధ్యాహ్నం పూట 23 శాతం ఉంటుందన్నారు. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున చిన్నా రులు, వృద్ధులు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లే సమయంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు.