జగనన్నే మా భవిష్యత్తు ఈ నినాదం ఊరూవాడా వినిపించాలని, ప్రతి ఒక్కరూ జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకోవాలని రాష్ట్ర విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. బుధవారం యల్లనూరు మండలంలోని నిట్టూరు, పెద్దమల్లేపల్లి, చిలమకూరు, యల్లనూరు 1 & 2 సచివాలయాలు, వెన్నపూసపల్లి, గడ్డంవారిపల్లి సచివాలయాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. సచివాలయాల్లోని మండల ఇంచార్జి, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు సమావేశం నిర్వహించారు. పేద ప్రజలకు మంచి చేసే జగనన్నలాంటి ముఖ్యమంత్రి పదికాలాలు పదవిలో ఉంటే ఆ రాష్ట్రం మూడుపువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతుందని అన్నారు. మీరు ఇంటింటికి తిరిగినప్పుడు రకరకాల వ్యక్తులు మనకు ఎదురవుతుంటారని అన్నారు. వారందరితో సఖ్యతగా మాట్లాడమని తెలిపారు. కొందరు సరదాగా ఉంటారు, కొందరు ఆత్మీయంగా ఉంటారు, కొందరు రమ్మని ఆహ్వానిస్తారు, కొందరు బిజీగా ఉన్నాం తర్వాత రమ్మని అంటారని తెలిపారు. అందుకని మీరు కూడా చిరునవ్వుతో వారితో మాట్లాడండి. మొదటగా జగనన్న సంక్షేమ పథకాలు, అవి పేద ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయి, నాడు-నేడు పాఠశాలల అభివృద్ధి, ఫీజు రీయంబర్స్ మెంట్, రుణమాఫీ, చేయూత, ఆసరా, అమ్మఒడి ఇలా పథకాలన్ని చక్కగా వివరించండి, అలాగే ఆ కుటుంబానికి జగనన్న నుంచి అందిన సంక్షేమ పథకాలను వివరించండి. ఎన్ని లక్షల రూపాయలు వచ్చాయో క్లియర్ గా చెప్పండి అని తెలిపారు.