విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఆందోళనలో భాగంగా మరో పోరాటానికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా స్టీల్‌ప్లాంట్ ఇంటక్ కార్యాలయంలో మంగళవారం కమిటీ నాయకులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ నెల 15న పెదగంట్యాడ గాంధీ విగ్రహం నుంచి సింహాచలం కొండపైకి పాదయాత్ర, 25వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టీల్‌ప్లాంట్ సీఎండీ, డైరెక్టర్ల బంగ్లాలను ముట్టడించాలని తీర్మానించారు. అలాగే ఈ నెల పదిన భారత రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఉక్కు ఉద్యమ దీక్షల శిబిరాన్ని వద్దకు రానున్నందున అధిక సంఖ్యలో కార్మికులంతా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జె. అయోఽధ్యరామ్, వై. మస్తానప్ప, నీరుకొండ రామచంద్రరావు, గణపతిరెడ్డి, డేవిడ్, శ్రీనివాస్, విళ్లా రామ్మోహన్కుమార్, తదితరులు పాల్గొన్నారు