అనుమాన స్పందన స్థితిలో గుర్తు వ్యక్తి మృతి చెందిన ఘటన అశ్వాణిపాలెం వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అశోక పార్క్ అశ్వాణిపాలెం రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ఒక గడ్డలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఎయిర్ పోర్టు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు క్లూస్ టీం ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. ఘటన స్థలం వద్ద వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుడు ప్రమాదవశాత్తు మరణించాడా, అత్మహత్యకు పాల్పడ్డా లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.