ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రాచనాగులు అనబడే మూడు కింగ్ కోబ్రాలు చూపర్లను భయాందోళనకు గురి చేశాయి. ఎట్టకేలకు అటవీ శాఖ వారి సహకారంతో ఈస్ట్రన్ వైల్డ్ ఆఫ్ సొసైటీ ప్రతినిధులు ఆ పాములను పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. వెంటనే భయాందోళనలు కలుగుతున్న వీటి వివరాలు పరిశీలిస్తే.. మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల దేవరపల్లి మండలం తారువా ఏటి బాడవ నదిలో ఈ కింగ్ కోబ్రాలు హల్చల్ చేస్తుంటే స్థానికులు గమనించారు. ఆ ఏటి బడవ వైపు మంగళవారం మధ్యాహ్నం వెళ్తున్న ముగ్గురు యువకులకు ఈ నాగులు బుసలు కొడుతూ కనిపించాయి.
దీంతో ప్రాణభయంతో పరుగులు తీసిన ఆ యువకులు వెంటనే చోడవరం అటవీశాఖ అధికారికి ఫోన్ ద్వారా సమాచారం చేశారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ రేంజ్ అధికారి వర్మ ఈ విషయాన్ని విశాఖలో ఈస్ట్రన్ వైల్డ్ ఆఫ్ సొసైటీ ప్రతినిధులకు సమాచారం అందజేశారు. దీంతో సొసైటీ ప్రతినిధులు మూర్తి, పి వెంకటేష్, అధికారులు పి శివకుమార్ ఎం నారాయణ తదితరులు పాములున్న ఏటిబడవ వద్దకు చేరుకున్నారు. గడ్డకు అనుకొని పొదల్లో ఉన్న మూడు రాచనాగుల్ని వారు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటిని పట్టుకునేందుకు సాయంత్రం వరకు సొసైటీ సభ్యులు పడరానీ పాట్లు పడ్డారు. ఎట్టకేలకు మూడు రాజనాగుల్ని వారు బంధించి సమ్మెద కు సమీపంలో గల అడవి ప్రాంతంలో విడిచిపెట్టారు.
ఒకటి 13 అడుగుల పొడవు గల ఈ రాచనాగులు లో ఒకటి పురుష జాతికి చెందినది కాగా రెండు ఆడజాతికి చెందినవని సభ్యులు తెలిపారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకొని అటవీ సిబ్బందికి సొసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా వారం రోజుల క్రితం సిరిజం గ్రామంలో కూడా 12 అడుగుల ఇంకో పామును పట్టుకున్నట్టు ఈస్టర్న్ వైల్డ్ ఆఫ్ సొసైటీ సభ్యుడు పి. వెంకటేష్ చెప్పారు.