ఛత్తీస్‌గఢ్‌లోని బల్రామ్పూర్-రామానుజ్‌గంజ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. జిల్లా సహకార బ్యాంకు ఉద్యోగులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన రామానుజ్‌గంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే బృహస్పత్ సింగ్ దాడి చేశారు. దీంతో ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సహకార బ్యాంకులు ఉద్యోగులు రెండు రోజుల పాటు సామూహిక సెలవులో వెళ్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు.