కర్నాటక స్టేట్ మంగళూరుకు చెందిన 70 ఏళ్ల చంద్రావతి సాహసానికి రైల్వే అధికారులు మెచ్చుకొని సన్మానించారు. మార్చి 21న రైల్వే ట్రాక్ పై చెట్టు కూలిపడగా ఈ విషయాన్ని రైల్వే అధికారులను చెప్పేందుకు ఆ వృద్ధురాలు వెళ్తుండగా ఇంతలోనే రైలు హారన్ వినిపించింది. వెంటనే ఎరుపు రంగు వస్త్రంతో పరిగెత్తెంది. గమనించిన లోకో పైలట్ అప్రమత్తమై బ్రేక్ లు వేయగా రైలు ఆగింది. దీంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.