ఎక్కడైనా విగ్గులు తలకు సరిపడేలా పొడవుగానే లేదా పొట్టిగానో ఉంటాయి. అయితే, ఆస్ట్రేలియాకు చెందిన డానీ రెనాల్డ్స్ అనే డిజైనర్ అత్యంత పెద్ద విగ్గును తయారు చేయడమే కాకుండా దాన్ని అలంకరించుకుని అతి పెద్ద గ్యాలరీ అయిన ‘ఏస్ గ్యాలరీ’లో ప్రదర్శించింది. దీంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ ప్రతినిధులు ఇన్ స్టాలో షేర్ చేయగా తాజాగా వైరల్ అవుతోంది.