పేదలకు మెరుగైన వైద్యం అందించడమే జగన్ ప్రభుత్వ ధ్యేయమని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం సంబేపల్లె మండలంలో నాడు నేడు క్రింద దేవపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ 21. 16 లక్షలుతోనూ, దేవపట్ల ప్రాథమిక రూ 29. 44 లక్షల నిధులుతోనూ చేపట్టి పూర్తయిన మౌలిక వసతులు, అభివృద్ధి పనులును జాతికి అంకితం చేయు వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. నాడు - నేడు పనుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాలు, పట్టణాలలో ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి పనులు చేపట్టడడం జరిగిందన్నారు. వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు.
ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ ఆరోగ్య కేంద్రంలో అందించు వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అవసరముల మేరకు ఆధునీకరించి అన్ని రకాల మందులను, వైద్య సేవలను ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలనేదే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని , రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ముఖ్యమంత్రి జగన్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను నిర్మిస్తున్నారన్నారు. దేవపట్ల, సంబేపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో శ్రీకాంత్ రెడ్డి పరిశీలించి , ఓపి సేవలపై ఆరా తీశారు.