రన్నింగ్ ట్రైన్ ఎక్కవద్దని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కొందరు దానిని విస్మరించి ప్రమాదాలకు గురవుతుంటారు. తాజాగా బిహార్‌లో ఝఝా రైల్వే స్టేషన్లో రైలు కదులుతుండగా ఓ వ్యక్తి పరుగున వచ్చి ఎక్కేందుకు ప్రయత్నించాడు. పట్టుతప్పటంతో జారి ప్లాట్‌ఫాంపై పడిపోయాడు. కొంచెం అటువైపు పడి ఉంటే రైలు చక్రాల కింద నుజ్జు నుజ్జయ్యేవాడు. అతడిని గమనించిన రైల్వే అధికారులు వెంటనే పక్కకిలాగి ప్రాణాలు కాపాడారు.