కోడి కూర విషయంలో తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తి తన కొడుకును చంపేసిన ఘటన కర్ణాటకలో మంగళవారం జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలోని సూలీయా తాలూకా గుత్తిగర్ గ్రామంలోని షీనా అనే వ్యక్తి ఇంట్లో వండిన కోడి కూర మొత్తం తినేశాడు. అనంతరం ఇంటికొచ్చిన కొడుకు శివరామన్ దీనిపై తండ్రితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కోపంతో తండ్రి షీనా కొడుకు తలపై కర్రతో కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేశారు.