శ్రీకాకుళం నగరంలోని పలు లాడ్జీల్లో బుధవారం తనిఖీలు జరిపినట్లు రెండో పట్టణ సీఐ పప్పల శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా ఎస్పీ జి. ఆర్. రాధిక ఆదేశాల మేరకు నైట్ బీటుల్లో భాగంగా అపరిచిత వ్యక్తులు, అనుమానితులు లాడ్జీల్లో ఉండొచ్చన్న అనుమానంతో గదులు తనిఖీ చేయడంతోపాటు కస్టమర్ రిజిస్టర్లు పరిశీలించామన్నారు. కస్టమర్ రిజిస్టర్లో వివరాలు సరిగా పొందుపర్చాలని, వచ్చిన వ్యక్తి ఆధార్ కార్డును క్షుణ్ణంగా పరిశీలించాలని లాడ్జీ యజమానులకు సూచించినట్టు చెప్పారు. వ్యక్తులపై ఏదైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఒకటో పట్టణ పరిధిలోని లాడ్జీలను నైటీ బీట్ విధులు నిర్వహించిన ఎస్సై ప్రవళ్లిక తనిఖీ చేశారు.