అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలో దారుణం జరిగింది. స్నాప్ చాట్ యాప్ ద్వారా ప్రేమించిన యువతిని హత్య చేయబోయి మరొక యువతిని హత్య చేసినట్టు గుర్తించారు. అమలాపురం ఏఎంజీ కాలనీ యువతితో ఐదు నెలల క్రితం స్నాప్ చాట్ యాప్ ద్వారా నెల్లూరుకు చెందిన కోట హరికృష్ణకు పరిచయమైంది. ఆమెకు వివాహమైందని తెలిసి కూడా ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు దిగాడు. దీంతో హరికృష్ణతో మాట్లాడడం మానేసి సదరు యువతి మెసేజ్లకు స్పందించడం మానేసింది. దీంతో హరికృష్ణ.. సైకోలా మారిపోయాడు. ఓ బార్లో మద్యం తాగి యువతిని అంతం చేయాలని స్కెచ్ గీశాడు. యువతి ఇంటికి వెళ్లి ఆమె అనుకుని అక్కడున్న పనిమనిషి మన్నే శ్రీదేవి(28)ని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇది చూసిన వెంకట రమణ అనే మహిళపై కూడా హత్యాయత్నం చేశాడు. ఆమె ఎలాగో తప్పించుకుంది. కేసు నమోదుచేసిన పోలీసులు హంతకుడిని పట్టుకొని అరెస్ట్ చేసారు.