ఉద్యోగులు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని, కనీసం వినడానికి కూడా సిద్ధంగా లేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఇప్పటివరకు శాంతియుతంగానే పోరాటం చేశామని, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మలివిడత పోరాటాలు ఉధృతం చేయాలని నిర్ణయించామని చెప్పారు. మే నెలలో ఉద్యమాన్ని కీలక దశకు తీసుకెళ్తామని హెచ్చరించారు.