ఒంటిమిట్టలో జరిగే శ్రీరామ కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ హాజరు కావాల్సి ఉండగా, కాలికి గాయం కావడంతో ఒంటిమిట్ట పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే గురువారం లింగుంట్లలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి జగన్ హాజరై పథకాన్ని ప్రారంభించారు. ఈ విషయమై టీడీపీ నేత అచ్చెన్నాయుడు పలు వ్యాఖ్యలు చేశారు. జగన్ కాలు బెణికినంత మాత్రాన ఒంటిమిట్ట కల్యాణానికి వెళ్లకుండా చిలకలూరిపేటకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు.