జనసేన పార్టీ ఒక సెలబ్రిటీ పార్టీ అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం విజయనగరంలోని ఐస్ఫ్యాక్టరీ కూడలిలో గాంధీతో పాటు వివిధ స్వతంత్ర సమరయోధుల విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... జనసేన పార్టీ గురించి స్పందించాల్సిన అవసరంలేదన్నారు. విశాఖపట్నంలో జరిగిన టీడీపీ జోనల్ మీటింగ్లో చంద్రబాబు మాటలను చూస్తే.. ఆయన కోరికలు మాత్రమే కనిపించాయన్నారు. నిందలు, అపనిందలు తప్ప ఉత్తరాంధ్రకు టీడీపీ హయాంలో ఏం చేశారో ప్రస్తావించలేదన్నారు. విశాఖలో అభివృద్ధి ఎవరు చేశారో టీడీపీ నాయకులు చర్చకు రావాలని సవాల్ విసిరారు.