ఇండియన్ నేవీ కమాండ్ చందక గోవింద మృతి పట్ల శుక్రవారం విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తీవ్ర సంతాపాన్ని తెలిపారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం పర్ల గ్రామానికి చెందిన చందక గోవింద ఇండియన్ నేవీ మెరైన్ కమాండో గా విధి నిర్వహణలో ట్రైనింగ్ నిమిత్తం పారాచ్యూట్ తెరుచుకోక. ప్రమాదవశాత్తు మరణించడం దురదృష్టమని పేర్కొన్నారు. మన ప్రాంతానికి మన దేశానికి మరి ముఖ్యంగా వారి కుటుంబానికి తీరనిలోటు అని అన్నారు. చందక గోవింద పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.