‘సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకి ఇంత మేలు చేస్తున్నా .... జనం మాత్రం ఇంకా రోడ్లూ, డ్రైనేజీలూ కావాలని అడుగుతున్నారు’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం తడుకు పీహెచ్‌సీలో గురువారం ఆయన ఫ్యామిలీ డాక్టర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్వేటినగరం కాశీ వీధిలో 75 ఏళ్లనాటి ఇళ్లకు పట్టాలు ఇప్పించిన, కడియాల సెల్వి అనే మహిళ తనను రోడ్డు, డ్రైనేజీ కావాలని అడిగిందని చెప్పారు. దాదాపు లక్ష రూపాయల పథకాలను అందుకుని కూడా ఆమె ఇలా అడిగిందంటూ వ్యాఖ్యానించారు.