వ్యవసాయ భూములు దున్నకుండా మొక్కజొన్న సాగు చేయడం వల్ల సాగు ఖర్చు తగ్గి, అధిక దిగుబడి పొందవచ్చని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సీనియర్ సమన్వయకర్త పి. తవిటినాయుడు తెలిపారు. నవంబర్, డిసెంబర్ లో ప్రయోగాత్మకంగా డబల్ వీల్ మార్కర్ తో విత్తిన మొక్కజొన్న దిగుబడులు పెరిగే విధంగా ఆశాజనకంగా ఉందని ఆయన అన్నారు. గురువారం పోలాకి మండలం మబగాం గ్రామ రైతులు మాట్లాడుతూ మొక్కజొన్న వరుసలో విత్తడం వలన పురుగు మందులు, ఎరువులు వేయడానికి సులభముగా ఉంటుందని, ప్రస్తుతం కోత దశకు చేరుకుందని, గతంతో పోలిస్తే కంకిలు పెద్దగా ఉండటం వలన దిగుబడి సుమారు 45 క్వింటాలు వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. గోపాలపెంట గ్రామంలో మొక్కజొన్న రైతులు మాట్లాడుతూ సాంప్రదాయ పద్ధతి కంటే డబల్ వీల్ మార్కర్ తో చేసిన మొక్కజొన్న పంట బాగుందన్నారు. సాగు ఖర్చు కూడా సుమారు 5000 వరకు తగ్గిందన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సమన్వయకర్తలు గొద్దు. ఉపేంద్ర, బొడ్డు సాయి, అలిగి. చంద్రశేఖర్ అభ్యుదయ రైతులు డి. లక్ష్మణదాసు, డి. మనోహర్ నాయుడు, కె. రాజారాం, డి. రామకృష్ణారావు జి. రమణమూర్తి రైతులు పాల్గొన్నారు.