ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ గ ఉన్న సీహెచ్ శ్రీకాంతను బదిలీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు ఐజీగా ఉన్న సీఎం త్రివిక్రమ వర్మను విశాఖ నగర పోలీసు కమిషనర్ గ నియమించారు. అలాగే విశాఖ డీసీపీ 1గా వివిఎస్ నాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.