ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు పెరుగుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా పార్వతీపురం, శ్రీకాకుళం, అనకాపల్లి, రంపచోడవరం, రాజమండ్రి, విజయనగరం ప్రాంతాల్లో రానున్న 5 రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వైజాగ్ సిటీ 34 నుండి 37 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఏపీ లోని మిగిలిన ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రత 36 నుండి 42 డిగ్రీల వరకు ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.