రాష్ట్రంలో 420 పాలన సాగుతోందని, ఫ్యామిలీ డాక్టర్ అంటూ చిలకలూరిపేటలో కొత్త పథకం ప్రారంభించిన జగనే ఫ్యామిలీ కిల్లర్ అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ పశ్చిమ ఇన్‌చార్జి పోతిన మహేష్ ధ్వజమెత్తారు. 44వ డివిజన్‌లోని డివిజన్ అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి, సురే్‌షతో కలిసి ‘ఇంటింటికీ రాబోయే మన జనసేన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు 4 స్థంబాల సెంటర్, నాగేంద్రనగర్, నాగేంద్రస్వామి గుడి ప్రాంతాల్లో మ హేష్ శుక్రవారం పర్యటించి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు.