ఈనెల 12న సీఎం జగన్ మార్కాపురం రానున్నారు. ఆ మేరకు అధికారికంగా సమాచారం అందింది. ఈ పర్యటనలో ఈబీసీ నేస్తం రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. దీంతో మార్కాపురం శాసనసభ్యుడు కుందురు నాగార్జునరెడ్డి, సీఐ భీమానాయక్‌లు సభ ఏర్పాటుకు సంబంధించి స్థానిక ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణాన్ని శుక్రవారం పరిశీలించారు. వారి వెంట వైసీపీ నాయకులు కుందురు కృష్ణమోహన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీర్జా షంషీర్ అలీబేగ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ షేక్ ఇస్మాయిల్ ఉన్నారు. శనివారం కలెక్టర్ దినేష్‌కుమార్ ఆ స్థలాన్ని పరిశీలించి సభ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.