తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్తపన్నును రద్దు చేస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 63వ డివిజన్ న్యూరాజీవ్‌నగర్ ప్రాంతంలో శుక్రవారం టీడీపీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. బొండా ఉమా నేతృత్వంలో ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజలెవరూ చెత్త పన్ను కట్టవద్దని, టీడీపీ అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేస్తామని ముద్రించిన స్టిక్కర్లను ఇంటింటికీ అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మళ్లీ సుభిక్షంగా ఉండాలంటే సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలన్నారు. ముందుగా రాజీవ్‌నగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నేతలు ఘంటా కృష్ణమోహన్, లబ్బా వైకుంఠం, బత్తుల కొండ, పట్టిమ రమణ, లబ్బా దుర్గ, కోలా శ్రీను, జైపాల్, బెజవాడ తిరుపతి, మురళీకృష్ణంరాజు, షేక్ బచ్చా పాల్గొన్నారు.