ఒంగోలు జిల్లాలో రోమన్ కాథలిక్ మిషన్ (ఆర్సీఎం) యాజమాన్యంలో నిర్వహిస్తున్న 15 స్కూళ్లను ప్రభుత్వంలో విలీనమయ్యాయి. ఆ మేరకు యాజమాన్యం ముందుకొచ్చింది. పాఠశాలల ఆస్తులను యాజమాన్యమే ఉంచుకొని పనిచేస్తున్న టీచర్లను మాత్రం ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ రాతపూర్వకంగా డీఈవోకు ఇచ్చింది. ఈ విషయాన్ని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయులను విలీనం చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ 15 పాఠశాలలను ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసే వరకు అంటే ఈనెల 30 వరకు యథావిధిగా నిర్వహించమన్నారు. ఆ తర్వాత ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లుగా నిర్వహించేందుకు వీలుకల్పిస్తూ డీఈవో పి.రమేష్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం చివరి పనిదినంలోపు పాఠశాలలో తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి పిల్లలను అక్కడే ప్రైవేటు పాఠశాలల్లో కొనసాగిస్తారా? లేక సమీపంలో ఉన్న ప్రభుత్వ లేదా ఎయిడెడ్ పాఠశాలల్లో చేర్చమంటారా? అన్న దానిపై అభిప్రాయాలను తీసుకుని సర్దుబాటు చేస్తారు.