ఒంగోలు జిల్లాలో ప్రభుత్వంలో విలీనమైన 15 ఆర్సీఎం ఎయిడెడ్ పాఠశాలల నుంచి 44 మంది ఉపాధ్యాయులు డీఈవో పూల్‌లోకి వస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవి ఎయిడెడ్ పాఠశాలలుగా కొనసాగవు. యాజమాన్యం వీటిని పాత గుర్తింపుతోనే ప్రైవేటు పాఠశాలలుగా నిర్వహించేందుకు డీఈవో అనుమతి ఇచ్చారు. ఒంగోలులోని సెయింట్ థెరిస్సా హైస్కూల్ నుంచి 13మంది, ప్రాథమిక పాఠశాల నుంచి ఐదుగురు, దొనకొండ ఆర్సీఎం ఎయిడెడ్ హైస్కూల్ నుంచి ఎనిమిది మంది, ఈతముక్కల నుంచి ఇద్దరు, చీమకుర్తి నుంచి ఇద్దరు, చినగంజాం నుంచి ఇద్దరు, కారంచేడు నుంచి ఇద్దరు, చీరాల నుంచి నలుగురు, గుడిమెళ్ళపాడు, బుచ్చిరాజుపాలెం, రేగులచెలక, వీబైలు, సిద్దవరం, పెదారికట్ల నుంచి ఒక్కొక్క ఉపాధ్యాయుడు డీఈవో పూల్‌లోకి రానున్నారు సిద్దాయపాలెంలోని మరో పాఠశాల ఎయిడెడ్‌ను కూడా యాజమాన్యం వదులుకున్నప్పటికి అక్కడ ఎవరూ పనిచేయడం లేదు. మే 1 నుంచి వారందరికీ డీఈవో పూల్‌లో జీతాలు చెల్లిస్తారు. వీరిని ప్రభుత్వ పాఠశాలలకు కౌన్సెలింగ్ ద్వారా రెగ్యులర్ ప్రాతి పదికన సర్దుబాటు చేసేంతవరకు పాత హెడ్ ఆఫ్ అకౌంట్ కిందే జీతాలు చెల్లిస్తారు.