గతంలో జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో వెలిగొండ ను వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసారని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. గడిచిన నాలుగేళ్లలో ఎన్నిసార్లు అడిగిన చేసింది ఏమి లేదన్నారు. ఇటీవల కూడా సెప్టెంబర్ చివరి నాటికి వెలిగొండను పూర్తి చేస్తానని మోసపూరిత హామీ ఇచ్చారన్నారు. అయితే ప్రాజెక్టుకు రూ.3500 కోట్లు అవసరం కాగా.. బడ్జెట్లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ప్రకటించారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.