1998-డీఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 11న సమాచారం ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. 12, 13 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి, నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తారని వివరించింది. ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఉంటాయని, రెగ్యులర్ ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాలు వీరికి వర్తించవని స్పష్టం చేసింది. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోగా ఎలిమెంటరీ విద్యలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తిచేయాలని, ఈ అభ్యర్థులను ఎస్జీటీలుగా తీసుకుంటున్నట్లు పేర్కొంది.