మహిళా సాధికారతలో భాగంగా అన్ని రకాల హక్కులూ కల్పించేందుకు సీఎం నిర్ణయించారు అని మంత్రి బొత్స తెలియజేయారు. సాధికారత తాలుకా ప్రయోజనాలు ఇవాళ మహిళలు పొందగలుగుతున్నారు. పూర్వం ఈ విధంగా పరిస్థితి అన్నది ఉండేది కాదు. ఆర్థిక క్రమశిక్షణను మగువలు పాటించాలి. అలానే పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. వైయస్ఆర్ ఆసరాను నాలుగు విడతల్లో చెల్లించేందుకు వీలుగా బ్యాంకర్లతో మాట్లాడి ఒప్పించారు. ఇప్పటికే మూడు విడతలు చెల్లించారు. ఇంక ఒక్క విడత మాత్రమే మిగిలి ఉంది. కనుక అది కూడా చెల్లించేస్తాం. మీరంతా సంఘాల బలోపేతానికి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. అలానే ఆ రోజు చంద్రబాబు చెప్పిన విధంగా మాట తప్పిన దాఖలాలు లేవు. అలానే ఆ రోజు చంద్రబాబు చెప్పిన విధంగా రైతుల రుణాల విషయమై, మహిళల రుణాల విషయమై జగన్ స్పందించి సత్వర చర్యలు తీసుకున్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట నిలుపుకున్న వైయస్ జగన్ కూ, ఆ రోజు ఇచ్చిన మాటను మరిచిపోయిన చంద్రబాబుకూ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను గమనించండి. మేలు చేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు.