సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు చార్జ్‌ల టెబుల్‌ను శనివారం విడుదల చేశారు. ఛైర్‌కార్ ఛార్జ్ రూ.1680, ఎగ్జిక్యూటివ్ ఛార్జ్ రూ.3080 ఫిక్స్ చేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఛైర్‌కార్ ఛార్జీ రూ.1625 నిర్ణయించారు. దీంతో తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది ఊరట కలిగించే విషయం. ఎందుకంటే ఇంతకుముందు లాగా..గంటల తరబడి రైలులో ప్రయాణం తప్పనుంది. దానితో పాటు టైమ్ కూడా చాలా సేవ్ కానుంది. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయి.. నల్గొండ, ఒంగోలు, నెల్లూు స్టేషన్లలో ఆల్టింగ్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైలు నెంబర్ (20701) సికింద్రాబాద్ లో ఉదయం 6 గంటలకు మొదలై మధ్యాహ్నం వరకు 2.30 వరకు తిరుపతిలో చేరుకుంటుంది. తర్వాత తిరుపతి నుంచి సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15కి స్టార్ట్ అయి రాత్రి 11.45 గంటల వరకు సికింద్రాబాద్ చేరుకోనుంది.