ఏపీలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పంటకు మద్దతుధర లేక క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందని తెలిపారు. 2019-20లో వ్యవసాయ ఉత్పత్తి 175 లక్షల టన్నులు ఉంటే.. ప్రస్తుతం 169 లక్షల టన్నులకు పడిపోయిందని విమర్శించారు. అగ్రికల్చర్ గ్రోత్ 2022-23లో 4.54 శాతానికి పడిపోయిందని తెలిపారు. ఆహార ధాన్యాల దిగుబడులు పెరిగాయంటూ సీఎం జగన్ అసత్యాలు చెబుతున్నారని తప్పుబట్టారు. సాగు విస్తీర్ణం తగ్గితే వృద్ధిరేటు ఎలా పెరిగిందో చెప్పాలి? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.