బనగానపల్లె మండలం లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాగంటిలో రెండవ శనివారం సెలవు దినాన్ని పురస్కరించుకొని భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. అదేవిధంగా దేవస్థానం పరిధిలోని కోనేరులో పుణ్య స్థానాలు ఆచరించి ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. అంతేకాకుండా క్షేత్ర పరిధిలోని వివిధ ఉపాలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు.