వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కు పల్నాడు జిల్లా నడికుడి రైల్వే జంక్షన్ లో శనివారం స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, దాచేపల్లి మున్సిపల్ చైర్పర్సన్ కొప్పుల సుబ్బమ్మ, సాంబయ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ను స్వాగతించారు. బిజెపి గురజాల నియోజకవర్గ కన్వీనర్ అంబటి నవ కుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పవిత్ర క్షేత్రం తిరుపతికి హై స్పీడ్ రైలు ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు.