శ్రీ సత్య సాయి జిల్లా చెన్నైకొత్తపల్లి మండలంలోని టింబక్టు కలెక్టివ్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం చెన్నేకొత్తపల్లి, రామగిరి, పెనుకొండ, రొద్దం మండలాలలోని విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టింబట్టు కలెక్టివ్ వ్యవస్థాపకురాలు మేరీ వటమట్టం మాట్లాడుతూ పేద విద్యార్థుల అవసరార్థం పదిమంది విద్యార్థులకు సైకిళ్లు, 30 మంది విద్యార్థులకు నిత్యవసరాలు, దుప్పట్లు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోమేనేజర్ శ్రీకాంత్, ప్రతినిధులు రమేష్, సుకన్య, మహేష్, జబీరా, కార్తీక్, రామన్న తదితరులు పాల్గొన్నారు.