కరోనా భాధితుల్లో గుండె, ఊపిరితిత్తుల సమస్యలు అధికంగా ఉంటున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసార్లు కరోనా సోకిన వారిలో గుండె కండరాల వాపు(మయోకార్డిటిస్) సమస్య వచ్చే ముప్పు మూడు రెట్లు అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. మయోకార్డిటిస్ వల్ల గుండెపోటుకు గురయ్యే ముప్పుతో పాటు డయాబెటిస్, బీపీ, ఆస్తమా,దీర్ఘకాల శ్వాసకోస సమస్యలు వంటివి వస్తాయని పేర్కొంటున్నారు.