గుత్తి మండలంలోని మాముడూరు గ్రామానికి చెందిన రామాంజినే యులు అను వ్యక్తి శనివారం క్రిమి సంహారక మందు సేవించి ఆత్మ హత్యా యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాలు మేరకు. రామాంజినేయులు గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఇంటిలో ఎవ్వరూ లేరు సమయంలో క్రిమి సంహారక మందు సేవించి పడివు న్నాడన్నారు. గుర్తించిన బంధువులు వెంటనే అతన్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్సలు అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.