తంబళ్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో గతంలో సకాలంలో డాక్టర్లు రాక రోగులు తీవ్ర ఇబ్బంది పడిన సంఘటనలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో నేడు పాతరోజులు గుర్తు వచ్చేలా శనివారం ఉదయం 10 గంటలు దాటినా డాక్టర్లు రాకపోవడం రోగులు వేచి చూడక తప్పని పరిస్థితి. సకాలంలో రోగులకు సేవలందిస్తున్న మెడికల్ ఆఫీసర్ పావని మదనపల్లి, తంబళ్లపల్లె ఆసుపత్రిలలో డిప్యూటేషన్ డ్యూటీతో మిగతా డాక్టర్లు సకాలంలో హాజరు కాకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది.