ఎస్బీఐ తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల రెంట్ పేమెంట్ ఛార్జీల్ని ఏకంగా 100% పెంచిన SBI, ఇప్పుడు కార్డ్స్ క్యాష్బ్యాక్ల్లో పెద్ద ఎత్తున కోతలు విధించింది. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ బెనిఫిట్స్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. జ్యువెల్లరీ,ఎడ్యుకేషనల్, యుటిలిటీస్, ఇన్సూరెన్స్, క్వాసీ క్యాష్, రైల్వేస్ వంటి సేవలకై చేసే చెల్లింపులపై ఇకపై ఎలాంటి క్యాష్‌బ్యాక్ ఇవ్వబోమని స్పష్టం చేసింది.